అక్షరటుడే, బాన్సువాడ: RTC tour package | పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కేటాయిస్తోంది. బాన్సువాడ డిపో(Banswada RTC Depot) నుంచి వారం రోజులకు ఒక తీర్థయాత్ర టూర్ ప్యాకేజీ బస్సును ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి.
RTC tour package | కర్ణాటకలోని పుణ్యక్షేత్ర దర్శనాలు
బాన్సువాడ డిపో నుంచి కర్ణాటక(Karnataka) రాష్ట్రం జర్హాసంగం మహాదేవుని దర్శనం, బీదర్ నర్సింహస్వామి ఆలయం(Bidar Narasimhaswamy Temple), గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయం (Ganugapur Dattatreya Temple) ప్రత్యేక డీలక్స్ బస్సును ఈనెల 10న బాన్సువాడ డిపో నుంచి నడపనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. బాన్సువాడ నుంచి ఉదయం ఆరు గంటలకు బస్సు బయలుదేరుతుందని, రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.1,300, పిల్లలకు రూ.650 ఉందని, టికెట్స్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని ఆమె కోరారు.