అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anasuya Bharadwaj | నిజామాబాద్ నగరంలోని నటి అనసూయ భరద్వాజ్ (Actress Anasuya Bharadwaj) సందడి చేసింది.
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఓ సిల్వర్ జ్యుయలరీ షోరూం ఓపెనింగ్ (silver jewellery showroom opening ceremony) కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి షోరూంను ప్రారంభించారు.
Actress Anasuya | నిజామాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలి ఏకాదశి రోజు పర్వదినాన మహిళామణుల కోసం షోరూం ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. మహిళల ఇష్టాలకు తగినట్లు షోరూంలో డిజైన్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.

Actress Anasuya | రంగమ్మత్తగా ఫేమ్
యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్‌లో ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారానే తెలుగు ప్రజలకు దగ్గరైంది. అనంతరం నటిగా మారారు. తొలుత చిన్నచిన్న పాత్రలు చేసిన అనంతరం పలు భారీ చిత్రాల్లో నటించింది.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఎంతో ఫేమ్ సాధించి తనకంటూ అభిమానులను సంపాదించింది. అంతేకాకుండా పుష్ప, పుష్ప–2 సినిమాల్లో సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.