అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actor Ravi Kishan | రేసుగుర్రం.. 2014లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం. ఇందులో విలన్ పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రవి కిషన్ (Racegurram movie villain actor Ravi Kishan), ఆ చిత్రంతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తరువాత ఆయన సుప్రీమ్, కిక్ 2, రాధా, సాక్ష్యం, ఎమ్మెల్యే వంటి సినిమాలలో నటించే అవకాశం రాగా, ఈ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రవికిషన్ యొక్క నటనా ప్రస్థానం బాలీవుడ్‌లో ప్రారంభం కాగా, ఆ తరువాత భోజ్‌పురి పరిశ్రమలో స్టార్‌డమ్ సాధించారు. అదేవిధంగా తమిళ్, కన్నడ, గుజరాతీ, ఆంగ్ల చిత్రాలలో కూడా నటించారు.
Actor Ravi Kishan | మరీ ఇంత లగ్జరీనా..
అయితే ఈయన సినిమా జీవితానికి పక్కన పెడితే, ఒకప్పుడు రవికిషన్ జీవితం ఎంత లగ్జరియస్‌గా ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు రోజూ పాలతో స్నానం చేయడం, గులాబీ రేకులపై నిద్రించడం వంటి జీవనశైలిని అలవాటు చేసుకున్నాడు. ఈ జీవనశైలే అతనికి కొన్ని మంచి అవకాశాలు కోల్పోవడానికి కారణమైంది. ఒక ఇంటర్వ్యూలో రవికిషన్ స్వయంగా ఈ విషయం గురించి పంచుకున్నారు. “ఒకప్పుడు నేను నిజంగా పాలతో స్నానం చేసేవాడిని. గులాబీ రేకులపై నిద్రించేవాడిని. ‘నటుడు అంటే ఇలాగే ఉండాలి’ అన్న భావనతో ఈ ఆచారాలను పాటించేవాడిని. హాలీవుడ్ స్టార్స్ ఆల్ పాసినో, రాబర్ట్ డి నీరో (Hollywood stars Al Pacino and Robert De Niro) వంటి వారిని చూసి వారి జీవనశైలి Life style నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వారిలా జీవించాలని నేను ఎంతగానో అనుకున్నా.
అయితే, ఈ విషయం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు (Director Anurag Kashyap) తెలిసినపుడు, తను తీసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రంలో నాకు అవకాశం ఇవ్వలేదు. ‘మీ డిమాండ్స్ తీర్చేందుకు మా బడ్జెట్ సరిపోదు’ అని చెప్పారు. ఇలా నా లైఫ్ స్టైల్ కారణంగా నేను కొన్ని సినిమా ఛాన్సులు కోల్పోయా. ఆ తరువాత ఎంతో కష్టపడి, మారిపోయి, నిజంగా మంచి నటుడిగా ఎదిగాను అని రవికిషన్ వెల్లడించారు. ప్రస్తుతం రవి కిషన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.