అక్షరటుడే, ఇందూరు: Tholi Ekadashi | తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలు (Temples) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం(Uttara Tirupati Kshetram), జెండా బాలాజీ (Jenda balaji), విఠలేశ్వర ఆలయం (Vitthaleshwara Temple), చక్రం గుడి తదితర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.
Tholi Ekadashi | తొలి ఏకాదశి ఉపవాసం ఉంటే..
తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని బ్రాహ్మణులు చెబుతారు.

