అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy Rains) కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో జురాల ప్రాజెక్ట్ (Jurala Project) నిండుకుండలా మారింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల నుంచి వచ్చిన నీటితో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 1,71,208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 67,399 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీల నీరు ఉంది.