అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sri Ram Sagar Project)కు స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ (Babli Project) గేట్లు ఎత్తడంతో ఎగువ నుంచి స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 6,090 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ(Mission Bhagiratha) కోసం 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 323 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ఆదివారం ఉదయానికి జలాశయంలో 1066.80 అడుగుల(18.443 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్ట్‌లో 11.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ ఎక్కువగా ఉంది. అలాగే మహారాష్ట్రలో వర్షాలు పడుతుండడంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రాజెక్ట్‌లోకి 7.59 టీఎంసీల నీరు వచ్చింది.