ePaper
More
    HomeజాతీయంMarriage | బ్రహ్మచారుల దేవుడు.. దర్శనం చేసుకుంటే మ్యారేజ్​ పక్కా..!

    Marriage | బ్రహ్మచారుల దేవుడు.. దర్శనం చేసుకుంటే మ్యారేజ్​ పక్కా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Marriage : పిల్లలకు సరైన వయసులో పెళ్లికాని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. సకాలంలో వివాహం కావాలని దేవుళ్లను వేడుకుంటారు. దైవ దర్శనంతో అడ్డంకులు తొలిగి పెళ్లవుతుందని భావిస్తుంటారు. ఇలాంటి వారికో ప్రత్యేక దేవుడున్నాడు. ఈ స్వామిని దర్శించేందుకు పెళ్లికాని ప్రసాదులు, వారి తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు.

    Marriage : పెళ్లికాని ప్రసాద్​ల దేవుడు..

    దేశంలో ఎక్కడా లేనివిధంగా మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో ఒక ప్రత్యేక స్వామి ఉన్నారు. దీనిని బ్రహ్మచారుల దేవుడుగా పేర్కొంటారు. ఈ దేవుడిని అమ్మాయిలైనా, అబ్బాయిలైనా దర్శనం చేసుకుంటే వివాహం జరుగుతుందని విశ్వాసం.

    Marriage : కేవలం 9 రోజులే దర్శనం

    మధ్యప్రదేశ్​లోని నీముచ్ జిల్లా (Neemuch district) జావాద్​లో బిల్లం బావజీ(Billam Bawaji) అనే దేవుడు ఉన్నారు. ఆయనను బ్రహ్మచారుల దేవుడుగా పేర్కొంటారు. బిల్లం బావజీ జాతర సంవత్సరంలో కేవలం 9 రోజులు మాత్రమే జరుగుతుంది. రంగ పంచమి నుంచి రంగ తేరాస్ వరకు ఈ వేడుక ఉంటుంది. ఈ రోజుల్లోనే ఆ స్వామిని దర్శించుకునేందుకు పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు పోటెత్తుతారు.

    READ ALSO  UPI ATM | భారత్​లో మొట్టమొదటి యూపీఐ ఏటీఎం.. అందుబాటులోకి తెచ్చిన స్లైస్​ ​ బ్యాంక్​

    బ్రహ్మచారుల కుటుంబాలు ప్రతి సంవత్సరం బిల్లం బావజీని దర్శించుకునేందుకు వస్తుంటారు. వీరి సౌకర్యార్థం బిల్లం బావజీ విగ్రహాన్ని జావాద్​లోని మార్కెట్ రోడ్డుపై తొమ్మిది రోజులపాటు కొలువుదీర్చుతారు. ఇలా గత 50 ఏళ్లుగా కొనసాగుతోంది.

    Marriage : బావిలో విగ్రహం లభ్యం

    సుమారు 50 ఏళ్ల క్రితం గణేశ్ ఆలయ బావిని శుభ్రం చేస్తున్నప్పుడు అందులో బిల్లం బావజీ విగ్రహం దొరికిందట. దానిని ఒడ్డుకు చేర్చి కొన్ని రోజులు ఉంచారట. ఈ క్రమంలో సంప్రదాయం ఎలా మొదలైందో కానీ, బిల్లం బావజీ విగ్రహాన్ని ఏటా గణేశ్ ఆలయ బావి నుంచి మార్కెట్​కు చేర్చి అక్కడ ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది.

    Marriage : ఆలయం లేని దేవుడు..

    తమ కోరిక నెరవేరాక భక్తులు తిరిగి వచ్చి, స్వామిని దర్శించుకుంటారు కూడా ఈ స్వామిని భైరవ్‌ జీ మహరాజ్ (Bhairav ​​Ji Maharaj) రూపంగా పేర్కొంటారు. కానీ, బిల్లం బావజీకి సొంతంగా ఆలయం అంటూ లేదు. జాతర జరిగే తొమ్మిది రోజులు తప్ప, ఈ స్వామి దర్శనం ఉండదు. ఎందుకంటే మిగతా రోజుల్లో గణేశ్ ఆలయంలోని బావి దగ్గరకు విగ్రహాన్ని చేర్చి అక్కడే ఉంచుతారు.

    READ ALSO  Hitech Theft | హైటెక్​ దొంగలు.. నిమిషంలో హ్యాక్​ చేసి కారు చోరీ

    Marriage : ప్రత్యేక నైవేద్యం..

    బిల్లం బావజీకి భక్తులు పాన్, కొబ్బరికాయను నైవేద్యంగా నివేదిస్తారు. పెళ్లి కావాలని కోరుకునేవారు దేవుడికి సమర్పించిన పాన్ తింటారు. అలా చేస్తే వారికి వివాహం జరుగుతుందని విశ్వాసం. కాగా, ఇక్కడి ప్రాంతంలో లింగ నిష్పత్తిలో తేడా గణనీయంగా ఉందట. ఈ క్రమంలో పెళ్లికాని ప్రసాదులు అధికంగా ఉన్నారని చెబుతుంటారు. అందుకే పెళ్లి జరగాలని యువకులు బిల్లం బావజీని దర్శించుకునేందుకు వస్తుంటారని స్థానికులు పేర్కొంటున్నారు.

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...