అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today gold price | అంతర్జాతీయ మార్కెట్లలో (Global markets) ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణులు దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులు ఊరటనిచ్చిన ధరలు మళ్లీ పెరుగుతుండటం పసిడి ప్రియులకు షాక్ ఇచ్చినట్లైంది. కాగా, జులై 6, 2025 ఆదివారం నమోదైన ధరల ప్రకారం బంగారం (Gold price), వెండి ధరలు (Sliver price) ఎలా ఉన్నాయంటే.. దేశవ్యాప్తంగా బంగారం ధరల పరిస్థితి చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830 (పది గ్రాములు), 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,600 (పది గ్రాములు)గా ఉంది. ఇక వెండి ధరలు చూస్తే వెండి ధర (కిలో) రూ.1,10,000 – రూ.1,20,000 మధ్య ఉంది.
Today gold price | ఏ నగరంలో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక ప్రముఖ నగరాల్లో ధరలపై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్‌లో 24 క్యారెట్లు ₹98,830గా ఉండగా, 22 క్యారెట్లు- ₹90,600, వెండి కిలో ₹1,20,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు హైదరాబాద్ ధరలతో సమానంగా ఉన్నాయి. ఇక వెండి ₹1,20,000లు పలుకుతోంది. ఢిల్లీలో చూస్తే.. 24 క్యారెట్లు ₹98,980గా, 22 క్యారెట్లు –₹90,750గా, వెండి ₹1,10,000గా నమోదైంది. ముంబైలో (Mumbai) 24 కారెట్ల బంగారం ₹98,830 కాగా, 22 కారెట్ల ధర ₹90,600గా, వెండి ₹1,10,000గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం 24 కారెట్ల ధర ₹98,830గా, 22 కారెట్ల ధర ₹90,600గా, వెండి ₹1,20,000గా ఉన్నాయి. బెంగళూరులో బంగారం 24 కారెట్ల ధర ₹98,830గా, 22 కారెట్ల ధర ₹90,600, వెండి ₹1,10,000గా పలుకుతున్నాయి.
బంగారం ధరలు ఇటీవల ఆల్‌టైమ్ హైని తాకిన తర్వాత కొంత తగ్గినా, మళ్లీ పెరుగుతున్న ధోరణి కనబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో గందరగోళం, స్టాక్ మార్కెట్లలో ఏర్పడిన అలజడి, డాలర్ (Dollar) బలహీనత వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో మరింత పెరుగుదల ఆశించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకుని, మార్కెట్‌ను గమనించాలంటున్నారు నిపుణులు.