అక్షరటుడే, వెబ్‌డెస్క్: KITS College : ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారికి ఇంజినీరింగ్ విద్య అందించేందుకు తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసం మన ఇందూరులోనే అందుబాటులో అధునాతన కోర్సులను అందిస్తోంది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(కిట్స్) Kakatiya Institute of Technology and Sciences (KITS) కళాశాల.
హైదరాబాద్(Hyderabad) వెళ్లి రూ.లక్షల్లో డొనేషన్లు, ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా నేటి మార్కెట్‌కు అవసరం అయ్యే కోర్సులను అందిస్తోంది కిట్స్ కళాశాల. నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మాణిక్‌బండార్ వద్ద ఉన్న ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (Computer Science Engineering), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ (Artificial Intelligence and Mission Learning), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (Electronics and Communication Engineering), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (Electrical and Electronics Engineering), సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

KITS College | వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్..
కిట్స్ కళాశాలలో రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు, 10 వేల లోపు ర్యాంకులు సాధించిన వారికి 100 శాతం రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అలాగే బీసీలు, ఓసీలకు 60 శాతం వరకు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నారు.
KITS College | ల్యాబ్ సౌకర్యం..
కిట్స్ లో అధునాతన ల్యాబ్‌లను తీర్చిదిద్దారు. అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇన్నోవేషన్ (Innovation club) క్లబ్, జే హబ్, ఐడియా షేరింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
KITS College | ప్రత్యేక వర్క్‌షాప్‌లు..
విద్యార్థుల్లో రీసెర్చ్ స్కిల్స్ (research skills) పెంచడానికి ప్రత్యేకంగా వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్జరుపుతున్నారు. వివిధ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పించేందుకు అవగాహన ఒప్పందం చేసుకుని, అందుకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
KITS College | ఏయే కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయంటే..
కిట్స్ లో అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్రాంచ్‌ల వారీగా సీట్లు పరిశీలిస్తే..
- కంపూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 120
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ 60
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ 120
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 30
- సివిల్ ఇంజినీరింగ్ 30
KITS College | ఏకైక మహిళా ఇంజినీరింగ్ కళాశాల
నిజామాబాద్ జిల్లాలో ఏకైక మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఈ కిట్స్. కాకతీయ విద్యా సంస్థల చైర్ పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి ఎంతో దూర దృష్టితో మహిళా విద్యార్థినుల కోసం ఈ కళాశాలకు బీజం వేశారు. ఆమె ప్రత్యేక ప్రణాళికా ప్రకారమే ఈ కళాశాలలో విద్యతో పాటు మంచి నడవడిక నేర్పిస్తున్నారు.
విద్యార్థినులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునేలా.. జాబ్‌కు కావాల్సిన ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల విద్యా కోర్సులో భాగంగా ఇంజినీరింగ్ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కల్పించి, జాబ్ సాధించేలా తోడ్పాటునందిస్తున్నారు. కోర్ బ్రాంచెస్లో చదివే.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా కళాశాలలో శిక్షణ పొందిన 20 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం.
KITS College | ప్రత్యేక శిక్షణ..
సాఫ్ట్ వేర్ జాబ్లకు సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. వివిధ కంపెనీలతో టయప్ అయి జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. మల్టినేషనల్ కంపెనీల్లో జాబ్‌లు పొందేలా ప్రత్యేక ఎగ్జామ్స్‌కు తగిన శిక్షణ ఇస్తున్నారు.
KITS College | సెక్యూరిటీపై ప్రత్యేక శ్రద్ధ..
మహిళల సెక్యూరిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. హాజరుశాతం కూడా 80కి తగ్గకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికితోడు నిజామాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు.
మా జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది
–రచిత, కమ్యూనికేషన్ స్ట్రాటజీ స్పెషలిస్ట్

నేను కాకతీయ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ఖతార్ ఎయిర్ వేస్‌లో జాబ్ చేస్తున్నా.. వేతనం 18 LPA. మా వృత్తిపరమైన ప్రయాణానికి మార్గం సుగమం చేయడంలో కిట్స్ కళాశాల యాజమాన్యం అవిశ్రాంత కృషి ఎంతో ఉంది. మాకు నిరంతరం మద్దతుగా నిలిచింది. శిక్షణ సెషన్‌లు, మాక్ ఇంటర్వ్యూలు, ప్రోత్సాహం.. తదితరాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మా సామర్థ్యాన్ని నమ్మి ప్రతి అడుగులోనూ మాకు మార్గనిర్దేశం చేసిన ప్రిన్సిపల్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీకి ప్రత్యేక ధన్యవాదాలు. కిట్స్ లో చదవడం నాలాంటి వారెందరికో జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.