అక్షర టుడే, గాంధారి: Gandhari | ఓ వినియోగదారుకు ఏకంగా రూ.9,876 కరెంట్ బిల్లు వచ్చిన ఘటన సదాశివనగర్ మండలకేంద్రంలో (Sadashivanagar mandal) జరిగింది. శివయ్య స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో (private company local) పని చేస్తుండగా, ఇంటి కరెంట్ బిల్లు గృహజ్యోతికి అనుసంధానం చేసుకున్నాడు. ప్రతినెలా జీరో బిల్లు (zero bill every month) వస్తోంది.
కానీ, ఈసారి ఏకంగా 1,096 యూనిట్లకు రూ.9,876 బిల్లు వచ్చింది. దీంతో ఇది చూసి కంగుతినడం శివయ్య వంతయింది. ఇంత పెద్దమొత్తం బిల్లు ఎలా చెల్లించాలని వాపోతున్నాడు. ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు వివరణ కోరగా, రూ.వంద చలానాతో ఎస్‌బీఐ, కామారెడ్డి ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌పై డీడీ చెల్లిస్తే అందుకు కారణాలు గుర్తిస్తారని తెలపడం విశేషం.
Gandhari | ఒక్కోసారి రీడింగ్ జంప్ కావచ్చు..
– గంగాధర్, ఏఈ
ఒక్కోసారి పొరపాటున రీడింగ్ జంపింగ్ కావడం వల్ల అధిక మొత్తంలో బిల్లు వస్తుంది. రూ.వంద డీడీ చెల్లిస్తే లైన్‌మెన్ ద్వారా నూతన మీటర్ లేదా పైస్థాయి అధికారుల ఆదేశానుసారం తగు చర్యలు తీసుకుంటాం.