అక్షర టుడే, బోధన్: Bodhan CI | బోధన్ శివారులోని డిపార్ట్‌మెంటల్ పెట్రోల్ పంపులో పనిచేస్తూ పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యమైనట్లు సీఐ వెంకట నారాయణ (CI Venkata Narayana) తెలిపారు.
ఈనెల 29న పెట్రోల్ పంపు నుంచి ఓ ఖైదీ పారిపోయిన విషయం తెలిసిందే. జైలు అధికారుల పిరుదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కాగా.. సదరు ఖైదీ తిరుపతిలో ఉన్నట్లు సమాచారం అందడంతో బోధన్ పోలీసులు శుక్రవారం అక్కడికి తరలివెళ్లారు.
ఈ మేరకు ఖైదీని అదుపులోకి తీసుకుని బోధన్ తరలించినట్లు సీఐ చెప్పారు. శనివారం కోర్టు ఎదుట హాజరుపర్చామని పేర్కొన్నారు. సదరు ఖైదీ వర్ని మండలం సైదాపూర్‌కు చెందిన జీవన్ కాగా.. గతంలో తన భార్యను చంపిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.