అక్షరటుడే, ఆర్మూర్: ACB | నిజామాబాద్ జిల్లాలో Nizamabad district ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి acb trap nizamabad చిక్కారు. ఆర్మూర్‌లోని పంచాయతీ రాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను ఏసీబీ acb cases today అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నందిపేట్‌కు చెందిన ఓ గుత్తేదారు నుంచి ఈయన రూ.7 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా, లంచం ఇవ్వడం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. కాగా అతడి ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ దాడి ఘటనతో మిగితా ప్రభుత్వ వర్గాల్లో గుబులు మొదలైంది.