అక్షరటుడే, హైదరాబాద్: IT Bonala Jatara : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ప్రసిద్ధి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు నిత్యం కంప్యూటర్, ల్యాప్టాప్ల ముందు బిజీగా గడుపుతూ ఉంటారు. ఎంతో బిజీ జీవితం గడిపే వీరు, సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. బోనాల జాతరకు బైలెళ్లబోతున్నారు.
హైదరాబాద్లో నేడు(జూన్ 6) ఐటీ బోనాల జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) Telangana Information Technology Association (TITA) ఆధ్వర్యంలో ఈ వేడుక జరుపుతున్నారు. ఈ సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమంలో 21 ఐటీ కంపెనీల(IT companies)కు చెందిన 1,500 కు పైగా ఉద్యోగులు పాల్గొంటారని టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు.
IT Bonala Jatara : ఊరేగింపు ఎక్కడంటే..
నేడు(ఆదివారం) ఉదయం 9 గంటలకు హైటెక్ సిటీ(Hitech City) వద్ద ఉన్న శిల్పారామం (Shilparamam) నుంచి చిన్న పెద్దమ్మ దేవస్థానానికి బోనాల ఊరేగింపు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ వేడుక చేపడుతున్నారు. ఈ వేడుకల్లో పోతురాజులు, శివసత్తులు, గుస్సాడి వంటి జానపద కళలు ఆకట్టుకోనున్నట్లు టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా చెప్పారు.