అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asi Promotions | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ కల్పిస్తూ సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు.
ప్రమోషన్ పొందిన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు రియాజుద్దీన్, డి.జక్రయ్య, కె.పరమేశ్వర్, పి.వసంత్‌రావు, కె.అరుణ కుమారి, జి.అనురాధ, జీవీ రమణేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్‌కుమార్ ఉన్నారు. ప్రమోషన్ పొందిన వారు 15 రోజుల్లో కొత్త స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.