అక్షరటుడే, బోధన్: మండలంలోని మినార్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య గొంతు కోసి హత్య చేసింది. రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి (Rural Sub-Inspector Machender Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మినార్పల్లి గ్రామంలో దేశ్యానాయక్కు భార్య, కొడుకు ఉన్నారు.
అయితే కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం రాత్రి దేశ్యానాయక్ ఇంట్లో నుంచి అరుపులు వినిపించగా స్థానికులు వెళ్లి పరిశీలించారు. అయితే అప్పటికే దేశ్యానాయక్ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి (Bodhan Government Hospital) తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్యతో పాటు కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.