అక్షరటుడే, నిజాంసాగర్: Bhubarathi | భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) అధికారులను ఆదేశించారు. శనివారం పెద్ద కొడప్గల్ (Peddagodapgal) తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.
Bhubarathi | 152 మందికి నోటీసులు..
రెవెన్యూ సదస్సులలో (Revenue Sadassu) 499 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటిలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆమె వెంట తహశీల్దార్ దశరథ్, నాయబ్ తహశీల్దార్ రవికాంత్, ఆర్ఐ అంజన్న, సిబ్బంది ఉన్నారు.