ePaper
More
    HomeతెలంగాణShadnagar | కిరాణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్ల అమ్మకం

    Shadnagar | కిరాణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్ల అమ్మకం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shadnagar | కిరాణ దుకాణంలో చాక్లెట్లు దొరుకుతాయి. కానీ ఈ దుకాణంలో మాత్రం గంజాయి చాక్లెట్లు(Cannabis Chocolates) లభిస్తాయి. హోటల్​, కిరాణ దుకాణం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్​ పోలీసులు(Excise Police) అరెస్ట్​ చేశారు.

    రంగారెడ్డి జిల్లా(Rangareddy District) షాద్​నగర్​ మండలం నందిగామ గ్రామంలో పింటూ సింగ్​ అనే వ్యక్తి కిరాణ దుకాణం(Kirana Shop), హోటల్​ నడిపిస్తున్నాడు. అందులో గంజాయి కూడా విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్​ అధికారులు శుక్రవారం రాత్రి దుకాణంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు గంజాయి, చాక్లెట్లు దొరికాయి. ఈ మేరకు శనివారం అధికారులు వివరాలు వెల్లడించారు.నందిగామ(Nandigama) పారిశ్రామిక ప్రాంతంలోని ఒక చిన్న హోటల్లో దాడి చేసి 2.5 కిలోల గంజాయి, 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పింటూ సింగ్​ను అరెస్ట్​ చేశామన్నారు.

    READ ALSO  America | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

    Shadnagar | జోరుగా గంజాయి దందా

    రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​ దందా(Drug Trafficking) జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేపడుతున్నారు. అంతేగాకుండా పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల కూలీలు ఉండే ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) డ్రగ్స్​కు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు దాడులు దాడులు చేస్తూ గంజాయి విక్రేతలను అరెస్ట్​ చేస్తున్నారు. అయినా దందా మాత్రం ఆగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్(Hyderabad)​ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్​ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఈగల్​ వ్యవస్థను తీసుకొచ్చింది.

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this