అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Seethakka | మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతు సంక్షేమం, ఉద్యోగాల భర్తీపై కేసీఆర్, కేటీఆర్ చర్చకు రావాలని శుక్రవారం జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్న విషయం తెలిసిందే.దీనికి శనివారం ఉదయం కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాము చర్చకు సిద్ధమని ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ (Somajiguda Press Club)లో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు.
అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేస్తే ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. సీఎం సవాల్ కేటీఆర్‌కు అర్థం కానట్టుందని పేర్కొన్నారు. సొంత చెల్లెలే కేటీఆర్‌ను నాయకుడిగా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇతరుల నాయకత్వాన్ని ఒప్పుకోమని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి సీతక్క కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. డెడ్ అయిన పార్టీ డెడ్‌లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలపై చర్చిద్దామంటే భయమెందుకన్నారు.