ePaper
More
    HomeసినిమాMahesh Babu | మ‌హేష్ బాబు బ‌ర్త్‌డేకి స్ట‌న్నింగ్ స‌ర్‌ప్రైజెస్‌.. రాజ‌మౌళి గిఫ్ట్ కోసం అంతా...

    Mahesh Babu | మ‌హేష్ బాబు బ‌ర్త్‌డేకి స్ట‌న్నింగ్ స‌ర్‌ప్రైజెస్‌.. రాజ‌మౌళి గిఫ్ట్ కోసం అంతా వెయిటింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆగస్టు 9న అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌లు రానున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ సూపర్ స్పెషల్ గిఫ్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ బాబు (Mahesh Babu) నటించిన క్లాసిక్ హిట్ అతడు సినిమాను 4K రీస్టోరేషన్‌లో రీరిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కట్ చేసిన న్యూ ట్రయిలర్ ఒకటి కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే ఫ్యాన్స్ కోసం రెడీ చేసి, పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా థియేటర్లలో స్పెషల్ అట్రాక్షన్​గా ప్రదర్శించనున్నారు. దీనివల్ల ఒకేసారి రెండు స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు థియేటర్లలో పండుగ వాతావరణం ఏర్పడనుంది.

    READ ALSO  Allu Arjun - Neel | ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్

    Mahesh Babu | స‌ర్‌ప్రైజెస్..

    ఇక మ‌రో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందనున్న మహేష్ బాబు గ్లోబల్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కూడా ఈ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి హింట్స్ వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయి, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ గ్లింప్స్‌లో కథ నేపథ్యంలోని కొన్ని విజువల్ స్పెషల్స్, మహేష్ క్యారెక్టర్ టోన్, రాజమౌళి స్టైల్ మేకింగ్‌కు సంబంధించి చిన్న టీజింగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారని టాక్. దీంతో ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఆగస్టు 9 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

    ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (Mahesh Babu Birthday Celebrations)కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. #SSMBBirthdayFest, #MaheshMania వంటి ట్యాగ్‌లతో ఫ్యాన్స్ భారీగా పోస్టులు షేర్ చేస్తూ జోష్ పెంచుతున్నారు. ఈ సారి మ‌హేష్ బాబు బ‌ర్త్ డే మ‌రింత స్పెష‌ల్ కానుంద‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. ఆగస్టు 9న మ‌హేష్ బాబు ఇతర చిత్రాలకు సంబంధించిన ఇత‌ర అప్‌డేట్స్ కూడా వ‌చ్చే అవకాశం ఉంది. అందువల్ల మహేష్ బాబు అభిమానుల ఆనందానికి ఆ రోజు అడ్డుక‌ట్ట‌వేయ‌లేం.

    READ ALSO  Fish Venkat | వెంటిలేటర్‌పై టాలీవుడ్​ నటుడు ఫిష్ వెంకట్.. సాయం కోసం ఎదురుచూపులు

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this