అక్షరటుడే, ఇందూరు : Manik Bhavan : గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మాణిక్ భవన్ పాఠశాల ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) (Sri Nutan Vaishya High School) కార్యవర్గం అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ కోరారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Manik Bhavan : సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు..
గతంలో రెండు సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శివప్రసాద్ చేపట్టామన్నారు. ఇప్పటికే పాత భవనాలను మరమ్మతులు చేయించి పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థుల ఉన్నతికి, పేద వైశ్య విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
Manik Bhavan : ఈ నెల 6న ఎన్నికలు..
సభ్యులు ఈ నెల 6న మాణిక్ భవన్ పాఠశాల Manik Bhavan School లో జరిగే సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. తమ బ్యాలెట్ నెంబర్ 1 కి ఓటేసి, తమ ప్యానెల్‌ను గెలిపించాలన్నారు. సమావేశంలో వైశ్య ప్రతినిధులు రాజశేఖర్, సతీష్ కుమార్, అరుణ్ కుమార్, రాఘవేంద్ర, వీరేందర్, సత్యప్రసాద్, శ్రీనివాస్, హరీష్ కుమార్, శ్రీధర్ గుప్తా, దీకొండ యశ్వంత్, పవన్ కుమార్, వెంకన్న, పాల్తి శ్రీనివాస్, రజినీకాంత్, సతీష్, విట్టల్, అమరేందర్ పాల్గొన్నారు.