అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | విత్తనాలను అధిక ధరలకు విక్రయించే ఫర్టిలైజర్స్ షాపులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో జిల్లాలో ఎరువులు విత్తనాల, సరఫరా, కల్తీ విత్తనాలు, మందుల అక్రమ అమ్మకం జరుగకుండా తీసుకోవాల్సి చర్యలపై సమావేశం నిర్వహించారు.
Kamareddy Collector | యూరియా అందుబాటులో ఉంది..
వానాకాలం పంట సీజన్లో (monsoon crop season) రైతులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, దాంతో పాటుగా మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. 8వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉందని.. అయినా యూరియా కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం రైతులను గందరగోళానికి గురి చేస్తుందన్నారు.
Kamareddy Collector | వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలి
వ్యవసాయాధికారులు (Agricultural officials) మండలాల వారీగా రైతులకు అవసరమైన మేర అందుబాటులో ఉన్న యూరియాను ఉపయోగించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. యూరియా అందుబాటులో ఉందనే సమాచారం రైతులకు అందించాలని సూచించారు. అలాగే గతేడాది ఈ సమయంలో ఎంత యూరియా రైతులకు అందించాం. ఇప్పుడు ఎంత అందించాం. ఇంకా ఎంత అవసరం ఉంటుందో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను (Agriculture Department officials) ఆదేశించారు.