అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom Scheme | ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూం ఇళ్లకు పట్టాలు ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి (Kamareddy) తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) వద్ద రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులు చేసి ఏళ్లు గడుస్తోందన్నారు. ఇళ్లవద్ద వసతుల కోసం కలెక్టరేట్ (Kamareddy Collectorate) వద్ద ధర్నా చేస్తే తప్పా సరైన వసతులు కల్పించలేదన్నారు.
Double Bedroom Scheme | రోడ్డు కూడా లేదు..
ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేదని, ముఖ్యంగా ఇళ్లపట్టాలు లేక తమకు గుర్తింపు లభించడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ధర్నాలు చేస్తేనే వసతులు కల్పిస్తారా అని ప్రశ్నించారు. డబుల్ ఇళ్లు ఇచ్చారని సంబరపడడమే తప్పా పట్టాలు ఇవ్వకపోవడంతో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.