అక్షరటుడే, వెబ్డెస్క్:Government Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 2025 నుంచి అమలు కావాల్సిన డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance) అనేది 3 శాతం నుంచి 4 శాతం వరకు పెంచనుంది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 55 శాతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏ 59 శాతానికి చేరే అవకాశం ఉంది. ఆలిండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం.. మే 2025లో ఇండెక్స్ 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరుకుంది. ఇది మార్చి నుంచి వరుసగా మూడు నెలలుగా పెరుగుతూనే ఉంది.
Government Employees | శుభవార్త..
మార్చి 2025లో – 143, ఏప్రిల్‌లో – 143.5, మేలో – 144, ఇలా స్టడీగా పెరుగుతూ వస్తోంది. జూన్ 2025లో ఈ సూచీ ఇంకాస్త పెరిగి 144.5కి చేరితే, గడిచిన 12 నెలల సగటు AICPI 144.17 పాయింట్లకు చేరుతుంది. 7వ వేతన సంఘం ఫార్ములా ప్రకారం, ఈ సగటుతో లెక్కిస్తే DA 58.85 శాతంగా వస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 59 శాతంగా మారుతుంది. అంటే జులై 2025 నుంచి డీఏ 4 శాతం పెరుగుతుందని అర్థం. DA సాధారణంగా జులై నుంచి అమలవుతుంది. అయితే, ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయం సెప్టెంబర్- అక్టోబర్ సమయాల్లో తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు పండుగల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో డీఏ(DA) పెంపు వలన ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు అందుతాయి.
అంచనా ప్రకారం దీపావళి సమయంలోనే డీఏ పెంపు ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. జూన్-25 నెలలోని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్(Consumer Price Index) ఆధారంగా డీఏ పెంపు చేస్తారు. గడిచిన 12 నెలల సగటు ఏఐసీపీఐ ఆధారంగా డీఏను లెక్కించడం జరుగుతుంది. ఇప్పటికే జనవరి- మే 2025 లెక్కలు వచ్చేశాయి కాబట్టి వాటి ఆధారంగా చూసుకుంటే డీఏ 3 శాతం పెరగనుంది. అయితే జూన్ లెక్కలు వస్తే దానిపై పూర్తి క్లారిటీ వస్తుంది. DA= (12 నెలల సీపీఐ-ఐడబ్ల్యూ- 261.42)/261.42×100 ఫార్ములాతో లెక్కించడం జరుగుతుంది. ఇందులో చూస్తే 261.42 అనేద నెంబర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ వాల్యూగా ఉంటుంది.