అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. వారాంతాన్ని లాభాలతో ముగించాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 67 పాయింట్ల స్వల్ప లాభంతో, నిఫ్టీ(Nifty) 23 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 83,015 నుంచి 83,477 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,331 నుంచి 25,470 పాయింట్ల మధ్యలో కదలాడాయి.
చివరికి సెన్సెక్స్(Sensex) 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 25,461 వద్ద స్థిరపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీలు లాభాల బాటలో పయనించగా.. ట్రెంట్(Trent) భారీగా నష్టపోయింది. రూపాయి విలువ ఏడు పైసలు క్షీణించింది. యూఎస్, భారత్ మధ్య సుంకాల సంబంధిత అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే వ్యవహరించారు.బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,259 కంపెనీలు లాభపడగా 1,790 స్టాక్స్ నష్టపోయాయి. 140 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 130 కంపెనీలు 52 వారాల గరిష్టాల(52 weeks high) వద్ద ఉండగా.. 59 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఆయిల్, ఎనర్జీ, రియాలిటీ స్టాక్స్‌లో ర్యాలీ..
బీఎస్‌ఈ(BSE)లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.26 శాతం పెరిగింది. ఎనర్జీ ఇండెక్స్ 0.90 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.87 శాతం, ఐటీ 0.65 శాతం, హెల్త్‌కేర్(Health care) 0.64 శాతం, పీఎస్‌యూ సూచీ 0.54 శాతం, బ్యాంకెక్స్ 0.44 శాతం లాభాలతో ముగిశాయి. ప్రీమియం కన్సంప్షన్ ఇండెక్స్ 1.19 శాతం, క్యాపిటల్ మార్కెట్ సూచీ 0.88 శాతం, మెటల్ ఇండెక్స్ 0.46 శాతం, టెలికాం సూచీ 0.22 శాతం క్షీణించాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం లాభపడ్డాయి.
Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 1.60 శాతం, ఇన్ఫోసిస్ 1.36 శాతం, హెచ్‌యూఎల్ 1.19 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.15 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.92 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers:ట్రెంట్ 11.93 శాతం, టాటా స్టీల్ 1.72 శాతం, టెక్ మహీంద్రా 1.13 శాతం, మారుతి 0.87 శాతం, అదాని పోర్ట్స్ 0.42 శాతం నష్టాలతో ఉన్నాయి.