అక్షరటుడే, గాంధారి: Gandhari | భూకబ్జాదారుల ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ, శిఖం భూములు మాత్రమే కాకుండా.. దేవాలయ భూములను సైతం రాత్రికిరాత్రి కబ్జా చేసేస్తున్నారు.
గాంధారి మండలంలోని (Gandhari mandal) గుడిమెట్ శివారులో గల మహదేవుని గుట్టను కొంతమంది కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే గుడిమెట్, మాధవ్‌పల్లికి చెందిన భక్తులు తహశీల్దార్ రేణుక చావన్‌కు (Tahsildar Renuka Chavan) వినతిపత్రాలు అందించారు. కబ్జా కోరల నుంచి ఆలయ భూమిని కాపాడాలని విన్నవించారు. మరోవైపు ఈ ప్రాంతంలో అక్రమ మొరం తవ్వకాలు సైతం చేపట్టారు. అయినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
Gandhari | ఏళ్లుగా ఆలయ ఆధీనంలో..
కబ్జాకు పాల్పడుతున్న గుట్ట ప్రాంతం గత కొన్నేళ్లుగా ఆలయ కమిటీ ఆధీనంలో ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా.. కొందరు వ్యక్తులు భూమిని కబ్జా చేయడమే కాకుండా.. దర్జాగా అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Gandhari | భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

– రేణుక చౌహాన్, గాంధారి తహశీల్దార్
మహదేవుని గుట్టపై ఉన్న భూమి ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. మండల సర్వేయర్‌తో సర్వే చేయించాం. ఎవరైనా ఎలాంటి హక్కులు లేకుండా కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.