అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thammudu movie Review | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన దర్శకుడు వేణు శ్రీరామ్(Director Venu Sriram) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నితిన్(Hero Nithin) సరసన కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక(Heroine Swastika) నటించారు. లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ రోజు విడుదలైన తమ్ముడు చిత్రం నితిన్‌కి హిట్ అందించిందా, మూవీ కథ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
కథ:
జయ్ (నితిన్) తన అక్క స్నేహలత (లయ) జీవితంలో జరిగిన ఒక కీలక సంఘటనకు కారణమవుతాడు. ఆమె తన ప్రేమను కాదని కుటుంబం ఒప్పించిన పెళ్లికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమయంలో తన సోదరుని సహాయం కోరుతుంది స్నేహలత. అయితే ఆ సమయంలో అతను మౌనం వహించడం వల్ల గుండె పగిలిన ఆమె ఇంటిని విడిచిపెట్టి, ఇకపై అతన్ని ఎప్పటికీ చూడనని ప్రమాణం చేస్తుంది. ఇక వైజాగ్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఒక పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెడుతుంది. అక్క స్నేహలత నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. బాంబ్ బ్లాస్ట్‌కు బాధ్యుడైన ఫ్యాక్టరీ యజమాని, తనకు అనుకూలంగా ఫేక్ రిపోర్టు ఫైల్ చేయాలని ఆమెను బెదిరిస్తాడు. ఆమె అంగీకరించకపోతే… ఆమె కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరిస్తాడు. ఇదంతా ఒకే రాత్రిలో జరుగుతుంది. జయ్ తన అక్కను, ఆమె కుటుంబాన్ని రక్షించి మళ్లీ అక్క చెంతన చేరతాడా, లేదా? అనేది మిగతా సినిమా కథ.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ బాగానే ఉంది. నితిన్ ఎప్పటి మాదిరిగానే తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అయితే సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడి కనెక్ట్ అవ్వకపోవడం వలన తన క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ పెద్దగా ఇంపాక్ట్ కాలేదు. ఎంత పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించిన కూడా ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ కాలేకపోతున్నారు. ఇక సప్తమి గౌడ సైతం మంచి పర్ఫామెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది కాని తను సినిమాలో లీనమై మాత్రమే నటించినట్టు అనిపించింది. వర్ష బొల్లమ తన పాత్ర మేరకు నటించింది. లయకి స్క్రీన్ టైం చాలా తక్కువే అయినా మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. విలన్ గా చేసిన సురబ్ సత్యదేవ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే తన విలనిజంతో ప్రేక్షకులు ఉలిక్కి పడేలా చేశారు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అంజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన సంగీతానికి మంచి మార్కులు పడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా అదరగొట్టాడు. ఎడిటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ లో లాగ్ సీన్స్ తీస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక వేణు శ్రీరామ్ తాను రాసుకున్న కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో బోల్తాపడ్డాడు. దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. వేణు శ్రీరామ్ తన గత సినిమాల మాదిరిగానే ఎమోషన్స్ ను ఫుల్ లెంత్ కంటిన్యూ చేయలేకపోవడం వలన ఆ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీక్వెన్సెస్
నితిన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
విశ్లేషణ:
నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. తమ్ముడు సినిమా కథ చాలా వీక్‌గా ఉండడంతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదట కుటుంబ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. అక్కడి నుంచి హంటర్ మూవీలా కొనసాగుతుంది. చివర్లో “మగధీర” గుర్తుకు వచ్చేలా ఒక ప్రీ-క్లైమాక్స్. హీరోయిన్ సప్తమి గౌడకు సంబంధించిన “హెల్ప్ డెస్క్” ఎపిసోడ్‌లోనూ అనవసరమైన సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది చూసే ప్రతి ఒక్కరికి ‘ఇది ఏం జరుగుతోంది?’ అనే అనుమానం రాక మానదు. కథలో హీరో నితిన్ ఏమీ చేయలేని స్థితి. ఎడిటింగ్ పేలవంగా ఉండటంతో పాటు, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే VFX పనితీరు చాలా తక్కువ స్థాయిలో ఉంది.మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అన్ని ముఖ్యమైన SOS కాల్స్‌న్నీ హీరోయిన్ రత్న (సప్తమి గౌడ) వద్దకే వచ్చేస్తాయి. ఆమె పాత్రను ఒక సారి రేడియో జాకీగా, మరొకసారి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చూపించి, అందుకు ఎలాంటి తగిన నేపథ్యం ఇవ్వలేదు. సినిమాలో కేవలం ఒక పాటే ఉంది.. అది కూడా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఇక ఇందులో విజువల్స్ ఆకర్షణీయంగా ఉంటే, లొకేషన్లు కొత్తగా అనిపిస్తాయి. సౌండ్ డిజైన్ కూడా బాగానే ఉంది.. కానీ, చివర్లో వచ్చే ఫైట్ సీన్‌లో VFX మాత్రం చాలా చీప్‌గా అనిపిస్తుంది. మొత్తం చెప్పాలంటే, ‘తమ్ముడు’ సినిమా కథా పరంగా మిస్ ఫైర్ అయింది.
నటీనటులు: నితిన్, లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర
దర్శకత్వం: వేణు శ్రీరామ్
సంగీతం: అంజనీష్ లోక్ నాథ్
నిర్మాత : దిల్ రాజు
రేటింగ్ 2.25/5