అక్షరటుడే, హైదరాబాద్: KCR : భారాస అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(former Telangana Chief Minister KCR) హెల్త్ బులెటిన్‌ను యశోద ఆసుపత్రి(Yashoda Hospital) యాజమాన్యం విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరిగినట్లు తెలిపింది. సోడియం లెవెల్స్ తగ్గాయని వివరణ ఇచ్చింది.
KCR : నీరసంగా ఉండటంతో..
కేసీఆర్‌కు నీరసంగా ఉండటంతో గురువారం (జులై 3) సాయంత్రం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన శరీరంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సోడియం స్థాయి మాత్రం తగ్గినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, షుగర్ లెవెల్స్(sugar levels) ను కంట్రోల్‌లోకి తెచ్చి, సోడియం లెవెల్స్ sodium levels ను పెంచుతున్నట్లు యశోద ఆసుపత్రి డాక్టర్ ఏంవీ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.