అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Oppo | ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో Oppo new phone మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. k13 సిరీస్‌లో వచ్చిన ఈ ఫోన్ 7000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో, గంటలోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.
బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. 6.7 ఇంచుల పుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 వర్షన్‌తో ఉన్న ఈ ఫోన్ విక్రయాలు ఒప్పో, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
Oppo | ఇతర వివరాలు..
స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ. ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఆప్షన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సదుపాయాలతో దీనిని తయారు చేశారు. 80 వాట్స్ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
Oppo | రేటు ఎంతంటే..
8జీబీ+128జీబీ మోడల్ ధర రూ.17,999.
8జీబీ+256 జీబీ ధర రూ.19,999.