అక్షరటుడే, వెబ్‌డెస్క్: Movie Piracy | ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమని పైరసీ (Piracy) భూతం ఎంత ఇబ్బందులకి గురి చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలను (Huge budget movies) సైతం పైరసీ భయబ్రాంతులకి గురి చేస్తుంది. తాజాగా విడుదలైన మొదటి రోజే పైరసీ చేస్తున్న ఓ యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన కిరణ్‌కుమార్ (Kiran kumar) అనే వ్యక్తి సినిమాలపై ప్రేమ చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ, సినీ పరిశ్రమకు (film industry) గండికొట్టే పని చేస్తున్నట్లు బయటపడింది. అతను ఇప్పటి వరకు 65 పైగా సినిమాలను పైరసీ చేసి, అనేక వేదికలపై షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని (heavy loss) కలిగిస్తున్న ఈ పైరసీ కార్యకలాపాలను గుర్తించిన సైబర్ క్రైమ్ (Cyber crime) విభాగం, పక్కా ఆధారాలతో కిరణ్‌ను అరెస్ట్ చేసింది. అతని నుంచి ల్యాప్ కిరణ్‌కుమార్ హై-డెఫినిషన్ క్వాలిటీలో సినిమాలను రికార్డ్ చేసి, వాటిని టెలిగ్రామ్ ఛానల్స్, టారెంట్ సైట్స్, మరియు డార్క్ వెబ్ వేదికలపై చలామణి చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. అతను సినిమాలు (Cinemas) రిలీజ్ అయ్యే ముందు వాటిని థియేటర్లలో రికార్డ్ (Theater record) చేయడం లేదా అంతర్గత లీక్స్ ద్వారా ఫుటేజ్ సేకరించడం వంటి పద్ధతులను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టుతో మరోసారి పైరసీ సమస్య (piracy problem) గురించి చర్చ తలెత్తింది. ప్రతి సంవత్సరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వస్తున్న పెద్ద సినిమాలు మొదటి వారం రోజుల్లోనే పైరసీకి గురవుతూ, నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. ఈ ఘటనపై పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఈ కిరణ్ కుమార్ (Kiran Kumar) అనే వ్యక్తి ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ వెండితెరపై విడుదలవుతున్న సినిమాలను ఫోన్‌తో రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో (Telegram groups)షేర్ చేస్తూ స్కామ్‌లోకి దిగేవాడట. అతను ఇప్పటివరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేసి అవి రిలీజైన రోజే టెలిగ్రామ్‌లో లీక్ చేస్తూ ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడని తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు తీసుకుంటూ… నెలకు రూ.80 వేల వరకు సంపాదించేవాడని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీపైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు ఫిర్యాదు చేయడంతో కిరణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సమాచారం.