అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లాలోని పురాతనమైన చారిత్రక నిర్మాణాలను (ancient historical structures) కాపాడి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇతిహాస సంకలన సమితి జిల్లా కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ అంకిత్‌కు (Additional Collector Ankit) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయం (Killa Ram Temple) అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. నిజాం కాలంలో దాశరథి కృష్ణమాచార్యులు నుంచి మొదలు ఎందరో స్వాతంత్ర సమరయోధులను ఇదే జైలులో బంధించినట్లు సాక్షాలు ఉన్నాయన్నారు.
ఎంతో మహోన్నతమైన చరిత్ర కలిగిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వాటి పునరుద్ధరించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఇతిహాస సంకలన సమితి జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్, కార్య అధ్యక్షుడు మోహన్ దాస్, ఉపాధ్యక్షురాలు శైలి బెల్లాల్, కార్యదర్శులు కందకుర్తి ఆనంద్, డాక్టర్ భూపతి తదితరులు పాల్గొన్నారు.