అక్షరటుడే, వెబ్‌డెస్క్: University Of Hyderabad | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) విద్యార్థి ఆస్ట్రేలియాలో పరిశోధనకు ఎంపికయ్యాడు. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో (Australian National University) చేపట్టే రీసెర్చ్‌కు సెలెక్ట్ అయ్యారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రణవ్ అనే విద్యార్థి ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ (Integrated MA Economics) చివరి సంవత్సరం చదువుతున్నాడు. తాజాగా ఆయన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కాన్‌బెర్రాలోని ప్రతిష్టాత్మక ఫ్యూచర్ రీసెర్చ్ టాలెంట్ (FRT) కార్యక్రమానికి ఎంపికయ్యాడు.
ప్రణవ్ ప్రస్తుతం నేషనల్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ పాపులేషన్ హెల్త్‌లో చైల్డ్‌హుడ్ షాక్స్, ఆరోగ్యకరమైన జీవనం అనే ప్రాజెక్ట్ చేపడుతున్నాడు. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌టీ స్కాలర్షిప్కు (FRT scholarship) ఎంపిక కావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రణవ్ను అభినందించారు. ఈ స్కాలర్షిప్లో భాగంగా ఆయన 8,500 ఆస్ట్రేలియా డాలర్ల (రూ.4.7 లక్షల) స్టైఫండ్ అందుకుంటారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రణవ్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు.