అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eagle System | ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) పలు రైల్వే స్టేషన్లలో భారీగా గంజాయి పట్టుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా పెరుగుతోంది. ఒడిశాతో పాటు ఏపీలోని మారుమూల ప్రాంతాల నుంచి గంజాయిని రైళల్లో పలు నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఈగల్, GRP, RPF పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు రైళ్లతో సోదాలు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) డ్రగ్స్, గంజాయిని అరికట్టడానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈగల్ చీఫ్ (Eagle Chief) రవి ఆదేశాల మేరకు దాడులు చేసి భారీగా గంజాయి చాకెట్లు (ganja chocolates), గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ మాట్లాడుతూ.. గంజాయి సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. గంజాయి అమ్మినా, కొన్నా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు అటాచ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సైతం డ్రగ్స్ నియంత్రణకు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు.