అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway Passengers | ఏళ్ల క్రితం నిర్మించిన ఆ రైల్వే మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు కూత పెట్టనుంది. తమ చెంతనే రైల్వే మార్గం ఉన్నా.. రైలు ఎక్కే భాగ్యం లేక ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. తాజాగా రైల్వేశాఖ (Railway Department) ప్రయాణికుల రైలు నడపడానికి ఆమోదం తెలపడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని (Amaravati) నడికుడి నుంచి శ్రీకాళహస్తి (Srikalahasti) వరకు రైల్వేలైన్ ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఈ మార్గంలో కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రయాణికుల రైళ్ల నడపాలని ఆయా గ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (weekly express) నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Railway Passengers | ప్రతి శుక్రవారం
శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే మార్గంలో (Srikalahasti – Nadikudi railway line) ఈనెల 4న తొలి రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నెమలపురి, రోంపిచర్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుందని వారు పేర్కొన్నారు. జులై 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతోంది. వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కు, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుకుంటుంది.