అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో ఒడిదుడుకులున్నా లాభాల్లో సాగుతున్నాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 192 పాయింట్లు పడిపోయింది. తిరిగి పుంజుకుని ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 333 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 52 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 76 పాయింట్లు కోల్పోయింది. తిరిగి కోలుకుని గరిష్టంగా 138 పాయింట్లు లాభపడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 313 పాయింట్ల లాభంతో 83,723 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 25,548 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | అన్ని రంగాల్లో ర్యాలీ..
పీఎస్‌యూ బ్యాంకు(PSU Bank) షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్ 0.95 శాతం పెరగ్గా.. ఆయిల్ అండ్ గ్యాస్ 0.85 శాతం, ఎనర్జీ 0.68 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.66 శాతం, ఐటీ 0.59 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.47 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.51 శాతం నష్టంతో కదలాడుతోంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.34 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో 7 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం(M&M) 1.61 శాతం, మారుతి 1.06 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.82 శాతం, ఇన్ఫోసిస్ 0.81 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.79 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Market | Top losers..
బజాజ్ ఫైనాన్స్(Bajaj finance) 1.46 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.43 శాతం, కొటక్ బ్యాంక్ 1.01 శాతం, ట్రెంట్ 0.96 శాతం, ఎస్‌బీఐ 0.31 శాతం నష్టాలతో ఉన్నాయి.