అక్షరటుడే, హైదరాబాద్: GHMC : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi chemical industry)లో జూన్ 30న భారీ పేలుడు ఘటన ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ Telangana చరిత్రలోనే అత్యంత విషాదకర పారిశ్రామిక ప్రమాదాల్లో ఈ ఘటన ఒకటిగా చెబుతున్నారు. పాతబడిన మిషనరీ వాడటం, కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ పారిశ్రామిక (Kattedan industrial estate) వాడలోని నేతాజీ నగర్ (Netaji Nagar) ప్రాంతంలో ఉన్న తిరుపతి రబ్బర్ కంపెనీ(Tirupati Rubber Company)లో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
GHMC : మరో ప్రమాదం..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్లాస్టిక్, రబ్బర్ పదార్థాలు ఉత్పత్తి చేసే యూనిట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిగాచి రసాయన పరిశ్రమలో సంభవించిన ప్రమాదం వలన 37 మందికి పైగా కన్నుమూశారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్పకూలగా, దాదాపు 100 మీటర్ల దూరానికి శరీర భాగాలు వెళ్లి పడడం ఆ ఘటన తీవ్రతను చాటింది. మృతులలో బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కార్మికులు ఉన్నారు.
సిగాచి పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy స్పందించారు. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పాటింపుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించగా, గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని సిగాచి సంస్థ హామీ ఇచ్చింది.