అక్షరటుడే, నిజాంసాగర్ : Kamareddy district : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని జగన్నాథ పల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి(జులై 2) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండలం(Jukkal mandal)లోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై తమ గ్రామానికి వెళ్తుండగా జగన్నాథపల్లి గేటు సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలిలోనే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.
Kamareddy district : పంక్చర్ కావడంతో..
పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి(Banswada Government Hospital)కి తరలించారు. టైర్ పంక్చర్ కావడంతో లారీని డ్రైవరు రోడ్డుపై ఆపినట్లు చెబుతున్నారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.