ePaper
More
    Homeబిజినెస్​Microsoft | మైక్రోసాఫ్ట్ లో భారీగా లేఆఫ్​లు.. మరో 9 వేల మందికి ఉద్వాసన

    Microsoft | మైక్రోసాఫ్ట్ లో భారీగా లేఆఫ్​లు.. మరో 9 వేల మందికి ఉద్వాసన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Microsoft | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ tech company Microsoft మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులకు కోత పెట్టనుంది. వేలాది మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత మందిని తొలగించేది ఆ సంస్థ వెల్లడించనప్పటికీ, ఒక సంవత్సరం క్రితం ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువగా ఉంటుందని తెలిపింది. అంటే దాదాపు 9 వేల మందిని తొలగించే అవకాశముందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. కొన్ని నెలల వ్యవధిలోనే భారీగా లేఆఫ్​లు layoffs ఇవ్వడం ఇది రెండోసారి.

    లే ఆఫ్​లు layoffs ప్రపంచ వ్యాప్తంగా తమ సేల్స్, వీడియోగేమ్స్ వంటి వ్యాపారాలపై ప్రభావం చూపుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. డైనమిక్ మార్కెట్లో విజయం సాధించడానికి కంపెనీ, బృందాలను ఉత్తమంగా ఉంచడానికి అవసరమైన సంస్థాగత మార్పులను మేము అమలు చేస్తూనే ఉన్నామని” తెలిపింది.

    READ ALSO  Stock Markets | ట్రేడ్‌ డీల్‌ ముందు అనిశ్చితి.. రోజంతా కొనసాగిన ఊగిసలాట.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    అయితే, ఉత్తమ సమయాల్లో కూడా వ్యాపార వ్యూహాత్మక డిమాండ్లను తీర్చడానికి తమ ఉద్యోగులను క్రమం తప్పకుండా సర్దుబాటు చేశామని పేర్కొంది. క్యాండీ క్రష్ గేమ్ Candy Crush game తయారు చేసే మైక్రోసాఫ్ట్ స్టాక్ హోమ్ Microsoft’s Stockholm కు చెందిన కింగ్ విభాగం తన సిబ్బందిలో దాదాపు 10 శాతం తగ్గించనుందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. జెనిమాక్స్ వంటి ఇతర యూరోపియన్ European కార్యాలయాలు కూడా కోతలు ఉంటాయని ఉద్యోగులకు సమాచారమిస్తున్నాయి.

    Microsoft | భారీగా కోతలు..

    ప్రపంచంలో మేటి టెక్ సంస్థగా పేరొందిన మైక్రోసాఫ్ట్ గతేడాది నుంచి ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నది. గతేడాది జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న సదరు సంస్థ.. మేలో లేఆఫ్ లు ప్రకటించింది. దాదాపు 6 వేల మందికి ఉద్వాసన పలికింది. అంతకు ముందు 2023లో 10 వేల మందిని తొలగించింది. తాజాగా మరో 9 వేల మంది ఉద్యోగులకు ఎసరు పెట్టింది.

    READ ALSO  Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మైక్రోసాఫ్ట్ మొగ్గు చూపుతుండడం ద్వారా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. చిన్న, మధ్య తరహా కస్టమర్లకు మరిన్ని సాఫ్ట్వేర్ అమ్మకాలను నిర్వహించడానికి థర్డ్ పార్టీ సంస్థలను ఉపయోగిస్తామని మైక్రోసాఫ్ట్ గత ఏప్రిల్లో ఉద్యోగులకు సమాచారమిచ్చింది. దీర్ఘకాలిక వృద్ధికి అనుగుణంగా పెట్టుబడులుంటాయని, ఇందుకోసం సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this