అక్షరటుడే, హైదరాబాద్: Advocates : ఫేక్ సర్టిఫికెట్లతో న్యాయ వ్యవస్థనే మోసగించారు ఆ ఉద్దండులు. నకిలీ ధ్రువపత్రాలతో అడ్వకెట్లుగా చెలామణి అవుతూ అటు కోర్టులకు, ఇటు ప్రజలకు కళ్లకు గంతలు కట్టి.. పెద్ద మనుషులుగా గుర్తింపు పొందుతూ.. ఫీజుల రూపంలో అందినకాడికి దండుకున్నారు.
అబద్ధం ఎన్నో రోజులు దాగదంటారు. అదే నిజం అయింది. ఫేక్ లా సర్టిఫికెట్స్ తో అడ్వకెట్గా ఎన్రోల్ చేసుకున్న వారి ఆటలను టీబీసీ కట్టడి చేసింది. సదరు వ్యక్తులపై తెలంగాణ బార్ కౌన్సిల్(Telangana Bar Council) కొరఢా ఝలిపించింది. ఏకంగా ఇలాంటి 9 మందిపై వేటు వేసింది. వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది.
ఫేక్ లా సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా ఎన్రోల్ అయిన తొమ్మిది మందిని బార్ కౌన్సిల్ తొలగించింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 2) బార్ కౌన్సిల్ సెక్రటరీ ప్రకటన జారీ చేశారు.
Advocates : తొలగింపునకు గురైన వారు వీరే..
- అజర్ శ్రావణ్ కుమార్ (టీఎస్/1359/2008)
- ఎం.సురేఖా రమణి (టీఎస్/1206/2014)
- ఎన్.విద్యా సాగర్ (టీఎస్/2892/2016)
- పి.సిసిల్ లివింగ్స్టన్ (టీఎస్/2896/2016)
- సతీష్ కనకట్ల (టీఎస్/728/2017)
- నరేష్ సుంకర (టీఎస్/1214/2017)
- రాజశేఖర్ చిలక (టీఎస్/1354/2019)
- శ్రీశైలం.కె (టీఎస్/1565/2019) ఎ.ఉదయ్ కిరణ్ (టీఎస్/3626/2018)
కాగా, తొలగింపునకు గురైన వారిలో నిత్యం వార్తల్లో నిలిచే నరేష్ సుంకర వంటి వారి పేర్లు ఉండటంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం మొత్తం న్యాయ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.