అక్షరటుడే, వెబ్‌డెస్క్: Electric Buses | ప్రస్తుతం మెట్రో నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయొద్దని ఆదేశించింది. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డీజిల్ వాహనాలను హైదరాబాద్ నగరం బయటకు పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల తెలిపారు. నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central government) భారీగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం టెండర్ పిలిచింది.
ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్ల (electric bikes and cars) విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే ప్రభుత్వ రంగ ట్రాన్స్‌పోర్టు కోసం కేంద్రం తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్ ఆహ్వానించింది. మొత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ వేసింది. ఇందులో బెంగళూరుకు 4500 బస్సులు, ఢిల్లీకి 2800, హైదరాబాద్‌కు 2000, అహ్మదాబాద్‌కు 1000, సురాత్ కు 800 బస్సులను కేటాయించనున్నారు.