అక్షరటుడే, బిచ్కుంద: Degree Results | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో ఫలితాలను బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) విడుదల చేశారు. రెండు, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు, ఒకటవ, మూడవ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశం, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ అభినందనలు తెలిపారు.
