ePaper
More
    Homeఅంతర్జాతీయంSpring Airlines | విమానంలో సాంకేతిక లోపం.. 36 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా కిందకు..

    Spring Airlines | విమానంలో సాంకేతిక లోపం.. 36 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా కిందకు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spring Airlines | విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందతున్నారు. అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయి (Ahmedabad Plane Crash) 270 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు విమాన ప్రయాణం అంటేనే ఆలోచిస్తున్నారు. తాజాగా జపాన్​ (Japan)లో ఓ విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఒక్కసారిగా విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగింది. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.

    జపాన్​లోని స్ప్రింగ్‌ ఎయిర్‌లైన్స్ (Spring Airlines) విమానం జూన్​ 30న చైనా(China)లోని షాంఘై నుంచి జపాన్​ రాజధాని టోక్యో (Tokyo)కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఫ్లైట్​ ఒక్కసారిగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి పది వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. ఏం జరుగుతుందో తెలియాక ప్రయాణికులు తీవ్రంగా భయ పడిపోయారు. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులు ఆక్సిజన్​ మాస్కులు పెట్టుకొమని చెప్పారు. ఫైలెట్​ చాకచక్యంగా స్పందించి ఏయిర్​ కంట్రోల్​ అధికారులకు సమాచారం అందజేశాడు. అనంతరం జపాన్​లోని ఒసాకో విమానాశ్రయంలో ఫ్లైట్​ను అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్​ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 191 మంది ఉన్నారు.

    READ ALSO  India - Us trade deal | అమెరికాపై ప్ర‌తీకార సుంకాలు.. డ‌బ్ల్యూటీవోకు స‌మాచార‌మిచ్చిన ఇండియా

    Latest articles

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు...

    More like this