ePaper
More
    HomeసినిమాHarihara Veeramallu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూసి అదిరిపోయే రియాక్ష‌న్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్​

    Harihara Veeramallu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూసి అదిరిపోయే రియాక్ష‌న్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Harihara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) మూవీ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. ఇక ట్రైలర్‌(Trailer)ను జులై 3వ తేదీ ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.. అయితే ట్రైల‌ర్‌ని ఈ సారి యూట్యూబ్​లో కాకుండా వినూత్నంగా 29 థియేటర్లలో థియేట్రికల్ రిలీజ్(Theatrical Release) ద్వారా ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, చిత్తూరు వంటి ప్రధాన నగరాల్లో అభిమానులు థియేటర్లకు వెళ్లి ట్రైలర్‌ను పెద్ద తెరపై చూసే అదృష్టం పొందనున్నారు.

    READ ALSO  Harihara Veeramallu Trailer | ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్న ట్రైల‌ర్‌.. ఇది క‌దా ప‌వ‌న్ మానియా అంటే..

    Harihara Veeramallu | పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా..

    ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద కట్ అవుట్లు, ఫ్లెక్సీలు, డీజేలు, బాణాసంచా వంటివి ఏర్పాటు చేస్తూ సినిమాకు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జులై 3న ఆ రోజంతా థియేటర్ల వద్ద పవన్ హవా కొనసాగనుంది. ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతుండడంతో, ట్రైలర్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది. పవన్ కల్యాణ్​ అభిమానులు ఈ ప్రత్యేక అనుభవాన్ని మిస్ అవ్వకుండా థియేటర్లలోనే ట్రైలర్‌ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.

    ఇక మ‌రి కొద్ది గంట‌ల‌లో విడుద‌ల కానున్న ట్రైల‌ర్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్​ చిత్ర బృందంతో క‌లిసి చూశారు. ట్రైల‌ర్ ప‌వ‌న్‌కు న‌చ్చ‌డంతో ప్ర‌త్యేకంగా టీమ్‌ని అభినందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. హరిహర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్​కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్​గా రానున్నారని టాక్ న‌డుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనుండ‌డంతో మూవీపై అంద‌రిలో ఆస‌క్తి నెలకొంది. ట్రైల‌ర్ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొంటే మూవీకి మ‌రింత బూస్ట‌ప్ రావ‌డం ఖాయం.

    READ ALSO  Allu Aravind | బ్యాంక్​ స్కామ్​ కేసులో నిర్మాత అల్లు అరవింద్​ను విచారించిన ఈడీ

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this