అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Sambhav IPO | స్టాక్ మార్కెట్‌లో బుధవారం మరో ఐదు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డు(Main board) ఐపీవో(IPO)లు కాగా.. మూడు ఎస్‌ఎంఈ(SME) ఐపీవోలు. మెయిన్ బోర్డు కంపెనీలైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ బీఎస్‌ఈ(BSE)తోపాటు ఎన్‌ఎస్‌ఈలో లిస్టై ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన సన్‌టెక్ ఇన్‌ఫ్రా, రామా టెలికాం కంపెనీ ఎన్‌ఎస్‌ఈ(NSE)లో, సూపర్ టెక్ ఈవీ బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. సన్‌టెక్ ఇన్‌ఫ్రా దాదాపు 30 శాతం ప్రీమియంతో, రామా టెలికాం కంపెనీ ఐదున్నర శాతం ప్రీమియంతో, సూపర్ టెక్ ఈవీ 20 శాతం డిస్కౌంట్‌తో లిస్టవడం గమనార్హం.
Sambhav IPO | హెచ్‌డీబీ ఫైనాన్షియల్..
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా హెచ్‌డీబీ ఫైనాన్షియల్(HDB Financial) రూ. 12,500 కోట్లు సమీకరించింది. ఇష్యూ ప్రైస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 740 కాగా.. 12.84 శాతం ప్రీమియంతో రూ. 835 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో గరిష్ట స్థాయి రూ. 849 కి చేరింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ. 831 వద్ద ట్రేడ్ అవుతోంది.
Sambhav IPO | సంభవ్ స్టీల్ ట్యూబ్స్..
రూ. 540 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో సంభవ్ స్టీల్ ట్యూబ్స్(Sambhv Steel Tubes) ఐపీవోకు వచ్చింది. ఆఫర్ ప్రైస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 82 కాగా.. ఈ కంపెనీ షేర్లు 34 శాతం ప్రీమియంతో రూ. 110 వద్ద లిస్టయ్యాయి. ఆ తర్వాత వెంటనే షేరు ధర రూ. 96.25 కు పడిపోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ. 100 వద్ద ట్రేడ్ అవుతోంది.
Sambhav IPO | సన్‌టెక్ ఇన్‌ఫ్రా..
రూ. 42.16 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన సన్‌టెక్ ఇన్‌ఫ్రా(Suntech Infra Solutions).. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ఇష్యూ ప్రైస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 86 కాగా.. 109 వద్ద లిస్టయ్యింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ. 103 వద్ద ట్రేడ్ అవుతోంది.
Sambhav IPO | రామా టెలికాం..
ఐపీవో ద్వారా రామా టెలికాం(Rama Telecom) కంపెనీ రూ. 23.87 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ షేరు ధర రూ. 68 కాగా.. రూ. 72 వద్ద లిస్టయ్యింది. అయితే వెంటనే ఐదు శాతం తగ్గి రూ. 68.40 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
Sambhav IPO | సూపర్ టెక్ ఈవీ..
ఐపీవో ద్వారా రూ. 28.39 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన సూపర్ టెక్ ఈవీ(Supertech EV).. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మూటగట్టి ఇచ్చింది. ఈ కంపెనీ షేరు ధర రూ. 92 కాగా.. 73.60 వద్ద లిస్టయ్యింది. వెంటనే మరో ఐదు శాతం తగ్గి రూ. 69.92వద్ద లోయర్ సర్క్యూట్ కొట్టింది.