అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు(Criminal case) నమోదైంది. పవన్ ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పవన్ కల్యాణ్‌తో పాటు, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai)పై మధురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ(Janasena Party) కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో పాటు పలు చిన్న పార్టీలతో పొత్తు కూడా పెట్టుకుంది. 2026 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Elections) జరిగే అవకాశం ఉంది. దీంతో అక్కడ పార్టీ బలోపేతంపై కూటమి భాగస్వామి అయిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) సేవలను బీజేపీ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మురుగన్ భక్తుల సమ్మేళనానికి బీజేపీ నాయకులు పవన్‌ను ఆహ్వానించారు. అయితే అక్కడ పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు పోలీసులను ఆశ్రయించడంతో తాజాగా కేసు నమోదు అయింది.