అక్షరటుడే, వెబ్డెస్క్ :Medaram Maha Jatara | ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన వేడుకగా పేరొందిన మేడారం మహా జాతర (Medaram Maha Jatara Dates) తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జాతర తేదీలను పూజారుల సంఘం బుధవారం ప్రకటించింది.
ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలంలో మేడారం సమక్క – సారక్క జాతర ఘనంగా నిర్వహించనున్నారు. రెండు ఏళ్లకు ఒకసారి మహా జాతర జరుగుతుంది. ఇందులో భాగంగా 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు.
మహా జాతరలో భాగంగా 28న సారలమ్మ (Saralamma), గోవిందరాజు (Govindaraju), పగిడిద్దరాజు (Pagididdaraju) గద్దెలపైకి చేరుకుంటారు. 29న సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి వస్తారు. 31న అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Medaram Maha Jatara | వన దేవతలకు ప్రత్యేక పూజలు
మేడారం జాతర సందర్భంగా వన దేవతలు సామక్క–సారలమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్ల జాతర సందర్భంగా పచ్చని అడవి.. జనసంద్రంగా మారుతుంది. జాతరలో భాగంగా అమ్మవార్లను గద్దెపైకి పోలీసు భద్రత (Police Security) మధ్య తీసుకువస్తారు. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తరలిస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వంశపారంపర్యంగా గిరిజనులే అమ్మవార్లకు పూజారులుగా కొనసాగుతున్నారు.