అక్షరటుడే, వెబ్‌డెస్క్: US ISKCON temple : అమెరికాలోని America ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో బంగ్లాదేశ్ Bangladesh లో ఇస్కాన్ ఆలయంపై దాడులు జరగడం, చిన్మయ్ కృష్ణదాస్ (Chinmay Krishnadas) ను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు హిందూ సమాజాన్ని కలిచివేశాయి.
ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం ఉద్రేకానికి దారి తీసింది. అమెరికాలోని ఉతాహ్ Utah రాష్ట్రం, స్పానిష్ ఫోర్క్Spanish Fork ప్రాంతంలో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ దేవాలయంపై కొందరు దుండగులు రాత్రివేళ కాల్పులు జరిపారు. భక్తులతో పాటు అతిథులు ఆలయంలోనే ఉన్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
US ISKCON temple : భారత్ సీరియస్..
ఈ ఘటనలో గోడలపైకి, కిటికీలపైకి 20-30 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆలయ నిర్మాణానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. గత నెలలో ఇప్పటికే మూడు సార్లు ఇలాంటి దాడులు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన ప్రకటించింది.
శాన్ ఫ్రాన్సిస్కో San Francisco లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక అధికారిక ప్రకటన చేస్తూ.. ఇస్కాన్ Iscon ఆలయంపై జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భక్తులు, ఆలయ నిర్వాహకులకు మద్దతుగా ఉంటాం.. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరుతున్నాం.. అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ చేశారు.
హోలీ వేడుకల Holi celebrations సమయంలో కూడా విద్వేషపూరిత దాడి జరిగింది. ఈ ఇస్కాన్ ఆలయం హోలీ Holi వేడుకలకు ప్రసిద్ధి. ఆలయంలో ఏడాది పొడవున పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు.
ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ Vai Warden మాట్లాడుతూ..“గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలయం శాంతియుతంగా కొనసాగుతోంది. కానీ, ఇటీవల మూడుసార్లు ఇలాగే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వాగత ద్వారాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలయం 1990లో నిర్మించబడింది. అప్పటి నుంచి ఇది స్థానిక హిందూ సంఘానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇస్కాన్ ఆలయంపై జరుగుతున్న దాడుల సంఘటనలు కేవలం సంప్రదాయాలపైనే కాదు, విద్వేషానికి ప్రతీకగా మారుతున్నాయి.