అక్షరటుడే, వెబ్డెస్క్ : Peddapalli Collector | ప్రభుత్వ ఆస్పత్రులు Govt Hospitals, పాఠశాలల schools కోసం ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. అయినా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం అక్కడ పర్యవేక్షణ సక్రమంగా ఉండదని వారు భావించడమే. వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరించి చూపాలి. తాజాగా పెద్దపల్లి కలెక్టర్ peddapalli collector కోయ శ్రీహర్ష ias sri harsha ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించి, ఆదర్శంగా నిలిచారు.
కలెక్టర్ భార్య విజయకు పురిటి నొప్పులు రాగా శనివారం సాయంత్రం గోదావరిఖని Godavarikhani ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి GGHకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు సీజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కూడా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు చికిత్స పొందినప్పుడే వాటిలో సేవలు మెరగవడంతో పాటు, ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుంది.