అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణతో దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా చివరికి లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 79 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా మరో 189 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య సాగి గరిష్టాలనుంచి 304 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 34 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 42 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 92 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు పుంజుకున్నాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 90 పాయింట్ల లాభంతో 83,697 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 25,541 వద్ద స్థిరపడ్డాయి. అపోల్ హాస్పిటల్స్‌లో కార్పొరేట్ చర్యలతో ఆ స్టాక్ దూసుకుపోయింది. మూడు శాతానికిపైగా పెరిగింది. బీఈఎల్(BEL), రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్ స్టాక్స్ సూచీలను పైకి తీసుకువెళ్లాయి.
బీఎస్‌ఈలో 2,021 కంపెనీలు లాభపడగా 1,989 స్టాక్స్ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 168 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 46 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో జోరు..
పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) స్టాక్స్ మరోసారి జోరును ప్రదర్శించాయి. రియాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.79 శాతం పెరగ్గా.. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.62 శాతం లాభపడింది. టెలికాం 0.52 శాతం, ఎనర్జీ 0.46 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 0.43 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్ 0.68 శాతం, పవర్ 0.41 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.26 శాతం, ఐటీ ఇండెక్స్ 0.25 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టపోగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం లాభంతో ముగిసింది.
Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో, 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. బీఈఎల్ 2.51 శాతం, రిలయన్స్ 1.84 శాతం, ఆసియా పెయింట్స్ 1.18 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.10 శాతం, కొటక్ బ్యాంక్ 0.93 శాతం లాభపడ్డాయి.
Top losers:యాక్సిస్ బ్యాంక్ 2.13 శాతం, ట్రెంట్ 1.25 శాతం, ఎటర్నల్ 1.14 శాతం, టెక్‌మహీంద్రా 1.05 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.95 శాతం నష్టపోయాయి.