అక్షరటుడే, ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎరువుల గోదాములు, పశువుల ఆస్పత్రి, తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు.
Collector Nizamabad | దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి..
అనంతరం ఆయన మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలో రైతులు ఇచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. రేషన్‌షాపుల్లో (Ration Shops) మూడునెలలకు సరిపడా పంపిణీ చేసిన రేషన్ వివరాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని తెలిపారు. ఇందల్వాయి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటరావు, సీనియర్ అసిస్టెంట్ గంగ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.