More
    Homeఅంతర్జాతీయంRoll Cloud | బీచ్‌లో వింత మేఘాన్ని చూసి భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

    Roll Cloud | బీచ్‌లో వింత మేఘాన్ని చూసి భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Portugal | ఇటీవ‌ల వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వింత‌లు ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా పోర్చుగల్‌లోని పోవోవా డో వర్జిమ్ బీచ్‌(Povoa do Verjim Beach)లో ఓ అరుదైన వాతావరణ ఘటన సందర్శకుల‌కు భయాందోళన కలిగించింది. సముద్రపు కెరటం లానే కనిపించే ఓ భారీ మేఘం ఆకాశంలో పైపు ఆకారంలో తీరం వైపు వేగంగా కదులుతూ వచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘రోల్ క్లౌడ్’(Roll Cloud) అంటారు. రోల్ క్లౌడ్ సమీపానికి వచ్చేసరికి బీచ్‌పై బలమైన గాలులు వీశాయి. దీంతో అక్కడున్న గొడుగులు, చిన్నచిన్న వస్తువులు ఎగిరిపోయాయి.

    Roll Cloud | ఇదేం వింత?

    పర్యాటకులు(Tourists) ఒక్కసారిగా షాక్‌కు గురై పరుగులు పెట్టారు. కొంతమంది స్థానికులు ఈ దృశ్యాన్ని ఫోన్‌లలో బంధించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం, రోల్ క్లౌడ్ అంటే ఏంటి అంటే.. ఇది చాలా అరుదుగా కనిపించే వాతావరణ(Climate) మార్పు. ఇది సాధారణంగా వేడి గాలులు మరియు చల్లటి గాలులు పరస్పర ప్రభావంతో ఏర్పడుతుంది. ఇవి భూమికి సమాంతరంగా, పైపు మాదిరిగా చలనం కలిగి ఉండడం విశేషం. ఇవి భారీగా కనిపించినా సునామీ(Tsunami)తో ఎలాంటి సంబంధం ఉండదు.

    READ ALSO  Donald Trump | ట్రంప్‌, నేత‌న్యాహుకు వ్య‌తిరేకంగా ఫ‌త్వా.. ఇద్దరినీ ఓడించాల‌ని ఇరాన్ మ‌త పెద్ద పిలుపు

    ప్రస్తుతం పోర్చుగల్‌(Portugal)లో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు విస్తరిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన అస్థిర పరిస్థితులే ఈ రోల్ క్లౌడ్‌కు కారణమని ‘యూరోన్యూస్’(Euronews) నివేదిక పేర్కొంది. దీంతో పాటు, వడగాలులతో అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం పెరిగిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, పర్యాటకులు ప్రత్యక్షంగా చూసిన ఈ వింత వాతావరణాన్ని జీవితంలో మరిచిపోలేనని చెబుతున్నారు.

    Latest articles

    YS Jagan | పాదయాత్రపై వైఎస్​ జగన్​ కీలక ప్రకటన

    అక్షరటుడే, అమరావతి : YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో తన పాదయాత్రpadayatra పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

    IndiGo flight | గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IndiGo flight : గన్నవరం ఎయిపోర్టు(Gannavaram airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్​ అయింది. సదరు...

    Snakes | పదేళ్ల బాలిక మెడలో రెండు కట్లపాములు.. రాత్రంతా అలాగే నిద్ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు....

    Runamafi | చేనేత కార్మికులకు గుడ్​న్యూస్​.. రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Runamafi | రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు (handloom workers) గుడ్​ న్యూస్​ చెప్పింది. నేతన్నల...

    More like this